ఇరకాటంలో బెంగళూరులో నాటకీయ పరిణామం కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ ను అడ్డుకున్న పోలీసులు బలపరీక్షపై తక్షణం వైఖరి ప్రకటించాలన్న సుప్రీం బెంగళూరు: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే విశ్వాస పరీక్ష జరపాలన్న విష , యంపై వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేప థ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధి యాకు మద్దతుగా బెంగళూరులో మకాం వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసు కునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్కడి రమాడ హోటల్ లో తల దాచుకున్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేం దుకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హెటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్ ఘోటల్ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ నేతలను అమృత హల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను దాచేశారు: దిగ్విజయ్ అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిని. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో - మిగతా 2లో...
ఇరకాటంలో కాంగ్రెస్ కాంగ్రెస్
• LEADER NEWS