కరోనా నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం

అమరావతి : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని మోదీ సూచనల మేరకు టీడీపీ ఆఫీసులోకి సందర్శకులు, కార్యకర్తలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. కరోనా వైరస్ పట్ల ప్రజలకు టీడీపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆ ప్రకటనలో వివరించారు.