విశాఖ శారదాపీఠంలో ఘంటానాదం

విశాఖపట్నం న్యూస్ లీడర్ 



విశాఖ శారదాపీఠం ఘంటానాదంతో మార్మోగింది. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో ఒకేసారి గుడిగంటలు మోగించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపఁనందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు మేధా దక్షిణామూర్తి మండపంలో పూజలు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఠంలోని ఆలయాలను దర్శించి దేవతామూర్తులకు హారతులిచ్చారు. కరోనా ప్రభావం నుంచి యావత్ ప్రపంచం బయటపడాలంటూ పూజలు చేసారు. విశాఖ శారదాపీఠంలో విద్యాభ్యాసం సాగిస్తున్న వేద విద్యార్థులంతా గుడి గంటలు మోగించారు