కరోనా ప్రభావిత జిల్లాలను లాక్‌డౌన్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాపించిన జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో కరోనా వ్యాపించినట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రకటించిన జాబితాలో.. తెలంగాణ నుంచి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం, విజయవాడ, వైజాగ్ జిల్లాలు ఉన్నాయి.