ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు
ఇంటి నుంచి బయటకు రావాంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి
ప్రధాని మోదీ పిలుపు
దిల్లీ, న్యూస్‌లీడర్: ‘కరోనా’తో అప్రమత్తంగా ఉండండి.. ఈ నె 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటించండి. మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టింది. భారత్ పై దీని ప్రభావం ఉండదనుకోవడం చాలా తప్పు. కొన్ని వారాల్లో దీని బారినపడే బాధితుల సంఖ్య పెరగబోతున్నారు. మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్న వేళ గురువారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘కరోనా’తో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది, మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ‘కరోనా’పై మనమంతా ఉమ్మడిగా పోరాడాని, ఇందుకు దేశ ప్రజ సహకరించాని కోరారు. ‘కరోనా’ పై దేశ ప్రజులు చాలా అప్రమత్తంగా ఉండాలని, భారత్ పై దీని ప్రభావం ఉండదనుకోవడం చాలా తప్పు అని అన్నారు. ‘కరోనా’కు మందులేదు కనుక అప్రమత్తతో ఉండాని ప్రజలకు పిలుపు నిచ్చారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని, రానున్న వారాల్లో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని, సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాని, గుమిగూడొద్దని, ఒకరి కొకరు సామాజిక దూరంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ నె 22న ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపు నిచ్చారు. ‘కరోనా’ మహమ్మారిని ఎదుర్కోవాంటే ఈ కర్ఫ్యూ తప్పదని, దీనిని యజ్ఞంలా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ పది మందికి ఫోన్ చేసి ‘జనతా కర్ఫ్యూ’ గురించి చెప్పాంటూ తన ప్రసంగాన్ని మోదీ కొనసాగించారు.