కరోన వైరస్ కట్టడిలో భాగముగా భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర అవసరాల వస్తువుల కోసం బయటకు వెళ్లేందుకు కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించనున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా స్పందించారని తెలిపారు. ప్రపంచ మానవాళికి తెలంగాణ ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచిందన్నారు. చప్పట్లతో అద్భుతంగా సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు
మార్చ్ 31 వరకు తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ముఖ్యమంత్రి కెసిఆర్
• LEADER NEWS