విశాఖ విమానాశ్రయంలో అరకొర వైద్య సిబ్బంది
తూతూ మంత్రంగా స్క్రీన్ టెస్టులు
స్కూట్ ఎయిర్ లైన్స్ టి ఆర్ 580 సింగపూర్ నుండి విశాఖకు శుక్రవారం గంటల 10.10 నిమిషములకు చేరుకోనున్నది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాధి విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న తెలుగువారు తమ తమ స్వదేశాలకు రావడానికి క్యూ
విమానాయన సర్వీసులు కొన్ని నిలుపదల వేయడంతో తెలుగువారు ఎక్కడివారక్కడే
విమాన సర్వీసులు ఈ నెల 16 నుండి నిలుపుదల
స్కూట్ ఎయిర్ లైన్స్ టి ఆర్ 580 సింగపూర్ నుండి విశాఖకు రావలసిన విమానం కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రబలుతున్న నేపథ్యంలో విమానము ను పూర్తిగా రద్దు
సింగపూర్ నుండి వారానికి మూడు రోజులు బుధవారం ,శుక్రవారం , ఆదివారం రోజులలో విమానము వస్తుంది
అయితే ఒక్కసారిగా విమానము కరోనా వ్యాధి దృష్ట్యా రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ మన తెలుగువారు ఉండిపోవడముతో కేంద్ర రాష్ట్ర సహాయంతో ఎట్టకేలకు 125 మంది తెలుగు ప్రయాణికులు విశాఖకు
వారికి స్క్రీన్ టెస్టులు చేయుట కొరకు 6 గురు వైద్యులు , 2 అంబులెన్స్ లు సిద్దం